Thefting Case: ఈ మధ్యకాలంలో ఇంటికి తాళం వేసి ఉంది అంటే చాలు దొంగలు వారి ప్రతాపం చూపిస్తున్నారు. సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదించడం కోసం చాలా మంది ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేసిన కూడా వచ్చే డబ్బు తక్కువే..అందువల్ల ఒక్క రాత్రి కష్టపడితే చాలు కొన్ని నెలల పాటు పని చేయకుండ దర్జాగా తిని తిరగచ్చని ఉద్యోగాలు చేసేవారు కూడా వాటిని వదిలేసి మరి దొంగతనాలు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఇంట్లో అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు భయం పుడుతోంది. దొంగలకు భయపడి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తమతో పాటు తీసుకెళ్లటం, లేదా బ్యాంక్ లాకర్ లో దాచుకొని మరి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నారు. ఏమవుతుంది లే అన్న ధీమాతో విలువైన వస్తువులు అలాగే ఇంట్లో పెట్టీ వెళ్తే మాత్రం వాటిని మనం మరచిపోక తప్పదు. ఇలాంటి సంఘటనే ఇటీవల రంగారెడ్డి జిల్లా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీలో గుండ్ల శేఖర్ గౌడ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు. పని ముగించుకొని తిరిగి గత బుధవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి 2.5 తులాల బంగారం,6 గ్రాముల వెండిని దొంగలించారు. ఇదే ఇంటిలో గత మూడు రోజులలో రెండు సార్లు దొంగతనం జరగటం తో పోలీసులు షాక్ అయ్యారు. ఇలా ఒకే ఇంట్లో అతి తక్కువ కాలంలో రెండు సార్లు దొంగతనం చేసి పోలీసులకు సవాలు విసురుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.