paritala Ravi: శ్రీరాములయ్య సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా తీశామని దర్శకుడు శంకర్ అన్నారు. ఎందుకంటే తన పెళ్లిలోనే బాంబు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. పరిటాల రవి కూడా ఎవరి పెళ్లిలకు, ఫంక్షన్‌లకు హాజరు కాకపోయేవారని ఆయన అన్నారు. ఎందుకంటే శ్రీరాములయ్య, అతని సోదరులను పెళ్లి వేడుకలోనే చంపారని ఆయన వివరించారు.
ఇకపోతే తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవి గారు కూడా మాజీ మంత్రిగా ఓ హోదాలోనే ఉన్న సమయంలో తనకు శత్రువులు ఇంకా ఉంటారా ? ఉండరా అన్న సందేహం మాత్రం అలాగే ఉండిపోయిందని ఆయన చెప్పారు. అలాంటి టైంలోనే ఆయన శత్రువులు సమయం కోసం ఎదురుచూశారన్న విషయం తెలుసుకోలేక పోయారని ఆయన అన్నారు. అదీ గాక చాలా రోజుల తర్వాత రవి గారు తన ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లికి వస్తున్నారు. కాబట్టి వాళ్లు దాన్నే టార్గెట్ చేశారని ఆయన అన్నారు. కానీ అక్కడ మిస్సయిందని ఆయన చెప్పారు.
ఆ ఘటన జరిగిన తర్వాత మరొకసారి ఆయన మీద దాడి చేసేందుకు ప్రయత్నించారని శంకర్ అన్నారు. అదీ షూటింగ్‌లో అని ఆయన చెప్పారు. ఇకపోతే పెళ్లిలో బాంబు పెట్టినపుడు చాలా మంది గాయపడ్డారని అప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని ఆయన అన్నారు. అది తాను చూడలేదు కానీ ఆ శబ్దం వినిపించిందని, అపుడు తాను షూటింగ్ వాళ్లతో మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. వెంటనే తనని శ్రీహరి వచ్చి ఒక రూంలో పెట్టారని, ఏం జరిగిందని అడిగితే విషయం చెప్పారని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఎవరికేమైందో చూడడానికి అపోలోకి వెళితే అక్కడ రవి కనబడలేదని నిమ్స్‌కి వెళ్లినట్టు ఆయన చెప్పారు.
ఆ తర్వాత అక్కడి వాళ్లను అడిగితే ఆస్పత్రి సిబ్బంది వాళ్లను గుర్తుపట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు. ఇంకో విషయమేమిటంటే తానే స్వయంగా కారు నడుపుకొని ఆస్పత్రికి వెళ్లాడని, అంతే కాకుండా మోహన్ బాబు గారిని కూడా తీసుకెళ్లారని ఆయన వివరించారు. ఇదంతా జరిగాక ఆయన సేఫ్ అని వాళ్లు చెప్పినట్టు శంకర్ చెప్పారు.