Suma Son: సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమా కనకాల మొదటి స్థానంలో ఉంటారు ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ ఇక్కడ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు ఇక రాజకీయ మీటింగ్ అయినా సినిమా వేడుక అయిన ఏదైనా కార్యక్రమం అయినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సుమా తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.
ఇక సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంటే ఆ సినిమా హిట్ అంటూ ఒకానొక సందర్భంలో మహేష్ బాబు కూడా తెలియజేశారు ప్రతి ఒక్కరిని కూడా ఆమె చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు అంటూ మహేష్ బాబు కూడా సుమ గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమా ఈవెంట్లు కార్యక్రమాలు అంటూ కెరియర్ లో ఎంతో బిజీగా గడుపుతున్న సుమ తన కుమారుడు రోషన్ ను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
రోషన్ ఇదివరకే బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఇక ప్రస్తుతం రోషన్ రెండో సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా సుమా కుమారుడు రోషన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోషన్ ఒక ఎమ్మెల్యే కూతురు ప్రేమలో పడ్డారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇలా ఎమ్మెల్యే కుమార్తెతో రోషన్ పీకల్లోతు ప్రేమలో పడ్డారని ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి కూడా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి సుమ కుమారుడు రోషన్ ప్రేమ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై సుమ స్పందించాల్సి ఉంటుంది.
