AP: ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా కూటమినేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించడమే కాకుండా పంచ్ డైలాగులు వేస్తూ ఉన్నారు.
గతంలో కూడా పవన్ కళ్యాణ్ గురించి జగన్ ఎంతో హేళనగా మాట్లాడేవారు. దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ మూడు పెళ్లిళ్ల వ్యక్తి అంటూ మాట్లాడేవారు. దీంతో జనసైనికులు జగన్మోహన్ రెడ్డికి ఊహించని దెబ్బ కొట్టారు కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆయనని పరిమితం చేశారు. ఇలా 11 స్థానాలు గెలిచి అప్పటికి కూడా జగన్ పవన్ విషయంలో ఏ మాత్రం మారడం లేదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ మాట్లాడిన తీరు జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలుకు పరిమితం చేసి చివరికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ అడుక్కునే స్థితికి తీసుకువచ్చారు.
ఇక పొరపాటున పవన్ కళ్యాణ్ మరోసారి గెలిస్తే ఇక జగన్ పరిస్థితి మామూలుగా ఉండదు. స్వయంగా ఆయన పోటీ చేసే పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గత ఎన్నికలలోనే చూపించారు. అలాంటప్పుడు మరోసారి పవన్ ని గెలికి ఏపీలో పూర్తిగా వైసీపీ లేకుండా చేసుకోవడం అవసరమా అంటూ జనసైనికులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు.