Bandla Ganesh: మళ్లీ అధికారం వారిదే… సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్!

Bandla Ganesh: సినిమా రంగానికి రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది .సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారందరూ కూడా రాజకీయాల్లో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇలా సినిమాలలోను అలాగే రాజకీయాలలో కొనసాగుతున్న వారిలో ప్రముఖ కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. ఒకప్పుడు ఈయన కమెడియన్ గా, ఆర్టిస్ట్ గా కొనసాగుతూ అనంతరం నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్ రవితేజ ఎన్టీఆర్ వంటి వారితో సినిమాలు చేశారు.

ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారు. అయితే ఈయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనంగా ఉంటాయి.

ఇకపోతే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ వార్తలలో నిలిచారు. అయితే ఈయన తాజాగా రాజకీయాలకు సంబంధించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువత తప్పదు అనివార్యమైన ఇటి విషయమై శోకింప తగదు అంటూ రాసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమిపాలు అయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు.

ఇలా ఓడినవారు మళ్లీ గెలవక తప్పరు అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి చేశారా తిరిగి వీరిద్దరూ అధికారంలోకి రాబోతున్నారని ఇలా చెప్పారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్న బండ్ల గణేష్ ఇలా తిరిగి ఓడిపోయిన వారు గెలవకు తప్పదు అంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.