Cancer: ఈ లక్షణాలతో బాధపడుతున్నారా… అది పెద్దపేగు క్యాన్సర్ కావచ్చు.. జాగ్రత్త!

Cancer: ఈ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి . మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనటంలో సందేహం లేదు .డబ్బు సంపాదనలో పడి సమయానికి తిండి తినక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు . అలా అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ప్రేగు క్యాన్సర్ కూడా ఒకటి .

పెద్ద పేగు క్యాన్సర్ నీ కోలోరెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు . ముఖ్యంగా క్యాన్సర్ వయసు పైబడిన వారిలో మొదలవుతుంది .ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది . సిగరెట్ తాగటం మద్యపానం సేవించడం వంటి అలవాట్లు ఉన్నవారిలో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి . శరీర కదలికలు లేని వారిలో కూడా అ ఆ ఇ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంది . పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం .

కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చినప్పుడు పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కలుగుతుంది . శరీరం మొత్తం ఎల్లప్పుడు నీరసంగా ఉంటుంది . పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చినప్పుడు విరేచనాలు , మలబద్ధకం , రక్తస్రావం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆకలి వేసినా కూడా కొంచెం తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది .

మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయటం వల్ల ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అరికట్టవచ్చు . మనం తీసుకునే ఆహారంలో ఐరన్ క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి . వాకింగ్ , రన్నింగ్ వంటి శరీరంలో కదలికలు కలిగించే చిన్నచిన్న వ్యాయామాలు చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరం .