Health Tips: శరీరంలో రక్తం శుద్ధిగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాలి..!

Health Tips:మనిషి శరీరంలో రక్తం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవం పనితీరు సక్రమంగా ఉండాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి . ఇంజిన్ నడవడానికి ఇందనం ఎంత అవసరమో మన శరీరానికి రక్తం కూడా అంతే అవసరం. శరీర భాగాలకు ఆక్సిజన్ కూడా రక్తం ద్వారా నే సరఫరా అవుతుంది. మీ శరీరంలో ఏదైనా భాగానికి రక్తం సరఫరా అవ్వలేదు అంటే పక్షవాత సమస్యలు వచ్చి ఆ భాగం చచ్చుబడి పోతుంది. శరీర భాగాలు అన్ని సక్రమంగా పని చేయాలంటే రక్తం శుద్ధి గా ఉండాలి. రక్తంలో మలినాలు బయటకు వెళ్లకపోతే మీరు అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. రక్తం శుద్ధిగా లేకుంటే మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి సన్నగిల్లి అలసట, తలనొప్పి, చర్మ సమస్యలు ఇంకా అనేక రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తుంది.

ఇటువంటి సమస్యల బారిన పడకూడదు అంటే రక్తం శుద్ధిగా ఉండటం ఎంతో అవసరం. సాధారణంగా చాలామంది రక్త శుద్ధి కోసం మార్కెట్లో దొరికే కొన్ని రకాల సిరప్స్ లేదా టాబ్లెట్స్ వాడుతుంటారు. మందుల వాడకం కంటే నేచురల్ గానే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల రక్తశుద్ధి మెరుగుపరచుకోవచ్చు. ఇక్కడ సుచించబోయే కొన్ని ఆహారపు అలవాట్లను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే రక్త శుద్ది బాగా జరుగుతుంది.

వ్యాయామం చేయడం వల్ల సాధారణంగానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎప్పుడు కూర్చుని ఉండేవారు రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. నడవటానికి సమయం లేనట్లయితే యోగా చేయడం వల్ల కూడా ఫలితం లభిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల రక్తం లోని మలినాలు చమట రూపంలో బయటకి వెళ్లిపోతాయి.

బీట్ రూట్ పచ్చిగా తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తాన్ని శుభ్ర పరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించకుండా కాపాడే శక్తి ఉంటుంది. బీట్ రూట్ లో రక్తం లోని మలినాలను, విష పదార్థాలను బయటకి పంపగలిగే శక్తి ఉంటుంది. వారంలో 2 నుంచి మూడు సార్లు బీట్ రూట్ జ్యూస్ తాగటం వల్ల రక్తహీనత సమస్య నుండి కూడా బయటపడవచ్చు.

శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లాలి అంటే నీటిని ఎక్కువగా తాగడం ఎంతో ముఖ్యం. రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం వల్ల మీ శరీరంలోని టాక్సిన్స్ బయటకు విడుదలై రక్తశుద్ధి జరుగుతుంది.

క్యాబేజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి జరుగుతుంది. వారంలో ఒకటి లేదా రెండుసార్లు క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలను ఇది శుద్ధి చేస్తుంది. అంతేకాదు శరీర బరువును తగ్గించడంలోను క్యాబేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.