Spread Of Covid 19: కరోనా ప్రపంచ దేశాలన్నింటిలో విస్తృతంగా వ్యాప్తి చెందింది . ఇది ఒక అంటూ వ్యాధి. కోవిడ్ 19 సంక్రమించిన వ్యక్తి నీ తాకిన, ఆ రోగి తాకిన వస్తువులని తాకిన సరే అది సంక్రమిస్తుంది అని మన అందరికీ తెలుసు. కానీ వైరస్ వాచ్ స్టడీ యొక్క తాజా అధ్యయనం ప్రకారం షాపింగ్ చేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించడం, పనికి వెళ్ళడం వంటి కారణాల వల్ల కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుందని తెలుపుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తగ్గి ఎటువంటి కరోనా పరిమితులు లేనపుడు 16 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయసు గల వ్యక్తుల మీద ఈ తాజా అధ్యయనం జరిపారు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మన దేశంలో నూతన సంవత్సరం మొదలయినప్పటి నుండి కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు సగటున రోజువారి కేసుల సంఖ్య 2 లక్షలు గా ఉంది.కరోనా ఎప్పుడు ఎలా సంక్రమించింది అనేది కూడా అంతుపట్టకుండా అయ్యింది. ఇంతకు మునుపు కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి కేసులను కనిపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. కరోనా ఇన్ఫెక్ష్లను మరింత పెరగకుండా నిర్మూలించడానికి, వ్యక్తుల కార్యకలాపాలను గమనించి వీలైనంత వాటికి దూరంగా ఉండాలి.
అధ్యయనం ప్రకారం షాపింగ్ చేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, ఆఫీస్ లకు వెళ్ళడం, పనులకు వెళ్ళడం, పార్టీలు, పెళ్ళిల్లకు వెళ్ళడం, హోటల్స్ లో తినడం, క్రీడలు ఆడటం వంటివి కరోనా వ్యాప్తికి ముఖ్యమైన కారణాలు. సొంత జాగ్రత్తలు లేకుండా, మాస్క్ లు, సానిటైజర్ లు వాడటం, భౌతిక దూరం పాటించకుండా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది. మన ఒక్కరం కరోనా నియమాలు పాటిస్తే సరిపోదు, ఇది అందరి కనీస బాధ్యత. క్రీడలు ఆడేటపుడు మాస్క్ ధరించకపోతే, అటువంటి సమయాల్లో వ్యాపిస్తుంది. షాపింగ్ కి వెళ్ళినప్పుడు సంక్రమణ ఎక్కువగా ఉంటుంది అని అధ్యయనం తెలిపింది. సినిమా థియేటర్లలో, అధిక జన సమూహాలలో తిరిగినప్పుడు వ్యాప్తి ఎక్కువగా ఉంది అని అధ్యయనం లో వెల్లడైంది. ఈ విషయాలను గుర్తుంచుకొని వ్యాప్తిని అరికట్టడమే కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.