Omicron variant symptoms: ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది…ఒమిక్రాన్ లక్షణాలు ఇవే!

Omicron variant symptoms: ప్రస్తుతం ప్రపంచమంతటా కరోనా చాప కింద నీరులా వ్యాప్తి చెంది అందరినీ కలవరపెడుతోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి . కరోనా ఒక్కొక్క వేరియంట్ వేరువేరు విధాలుగా లక్షణాలను కలిగి ఉంటున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు డెల్టా వేరియంట్ లక్షణాలతో పోల్చితే భిన్నంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం వలన ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుందని ఆరోగ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందటం పై WHO ప్రపంచ దేశాలు అన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమిక్రాన్ సోకిన వారిలో తలనొప్పి, వళ్ళు నొప్పులు వంటి సమస్యలతో తీవ్రంగా బాధ పడుతున్నారు.

ఒమిక్రాన్ బాధితులు తీవ్రమైన అలసట , గొంతు నొప్పి , గొంతు గరగర , కండరాల నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఒమిక్రాన్ , చికెన్ గున్యా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో ఒమిక్రాన్ వ్యాప్తి మరి ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సామాజిక దూరం పాటించటం చాలా అవసరం .
ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలి.. నిత్యం పరిశుభ్రంగా ఉంటూ తరచు చేతులు కడుక్కోవాలి. పెళ్లిళ్లు , ఫంక్షన్లు వంటి సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం చాలా అవసరం .శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెరగటానికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి.