శని దేవుని ఆరాధించే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..!

శని దేవుడు ఈ పేరు వింటేనే చాలామంది భయపడతారు. శనీశ్వరుడిని నమస్కరించడం వల్ల మనకు శని ప్రభావం తగులుతుందని, శని ప్రభావం మనపై పడితే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఇలా శని ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక ఎదుగుదల లేకపోవడం అలాగే ఎన్నో మానసిక ఇబ్బందులు తలెత్తడంతో జరుగుతూ ఉంటాయని చాలామంది భావిస్తారు. అందుకే శనీశ్వరుడిని పూజించాలంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే ఇదంతా కేవలం వారి అపోహ మాత్రమే. శనీశ్వరుడు ఎవరి పై అనవసరంగా తన ప్రభావాన్ని చూపించారు. శనీశ్వరుడు ఎవరి కర్మకు తగ్గ ఫలితాన్ని వారికి అందిస్తారు.

ఇకపోతే చాలామంది శని ఆలయంలోకి వెళ్ళినప్పుడు అలా నమస్కరించాలి ఇలా నమస్కరించాలి అని కొన్ని నియమాలు చెబుతుంటారు. అయితే శనీశ్వరుడు ఆలయంలోకి వెళ్ళిన తర్వాత శనిదేవుని ఏ విధంగా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం.. శనీశ్వరుడికి పూజించే సమయంలో శని వైపు చూస్తూ పూజ చేయకూడదు. అలాగే శని దేవుడిని నమస్కరించే సమయంలో శనీశ్వరునికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.శని దేవుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అలాగే ఆయనని నమస్కరించేటప్పుడు ఆయన పాదాలను మాత్రమే నమస్కరించాలి.

శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి ఆయనకు ఎంతో ఇష్టమైన నీలి రంగు పుష్పాలను సమర్పించి చలివిడి నైవేద్యంగా సమర్పించి పూజించాలి. శనివారం శనీశ్వరుడితో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల మన పై ఉన్నటువంటి శని ప్రభావ దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా శనీశ్వరుడిని పూజించే సమయంలో లేదా పిలిచేటప్పుడు చాలామంది శని అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు శని దేవుడిని శని శని అని పిలచకూడదు. ఈయనను శనీశ్వరుడు అని పిలవడం వల్ల ఈయన కూడా శివుడు వెంకటేశ్వరస్వామిల మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.ఎందుకంటే శని ఈశ్వరుని అంశం కనుక శని దేవుడిని ఎల్లప్పుడు శనీశ్వర అని మాత్రమే పలకాలని శాస్త్రం చెబుతోంది.