సాధారణంగా చిన్నపిల్లలు ఇంట్లో భోజనం చేయడానికి మారం చేస్తుంటారు.అలాగే బయట దొరికే చాక్లెట్స్, ఐస్ క్రీమ్, లాలీపాప్స్, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్ ను తినడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు.ఇలాంటివి ఎక్కువగా తినడం పిల్లలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నపిల్లలు ఏవేవో కారణాలతో ఇంట్లో తినడానికి ఆసక్తి చూపించరు. పిల్లలు తినలేదు కదా అని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో పోషకాహార లోపం తలెత్తి మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపి అన్నింట వెనకబడిపోతారు.
చిన్నపిల్లలకు తప్పనిసరిగా అందించాల్సిన ఆరపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల రోజువారి ఆహారంలో అత్యధిక విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ కే, కాల్షియం ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా కలిగిన పాలకూర, బచ్చలి కూర, గోంగూర, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను పిల్లలకు ఇష్టమైన సూప్స్, సలాడ్స్, కర్రీస్, ఫ్రై, జ్యూస్ రూపంలో అందిస్తే పిల్లల శారీరక మానసిక ఎదుగుదల కు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
చిన్నపిల్లలకు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును, చేపలను ఆహారంగా తినిపిస్తే వీటిలో లభించే అత్యధిక ప్రోటీన్స్, మినరల్స్ పిల్లల శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. మరియు వీటిల్లో అత్యధికంగా లభించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు కండరాలను దృఢపరిచి నాడీ కణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది ఫలితంగా పిల్లల్లో మానసిక పరిపక్వత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అలాగే చేపల్లో లభించే విటమిన్ విటమిన్ ఏ కంటి చూపులు మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు బాగా పండిన అరటిపండును పిల్లలకు తినిపిస్తే ఇందులో అత్యధికంగా లభించే కార్బోహైడ్రేట్స్ పిల్లలను త్వరగా అలసిపోనివ్వకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.