PVR investors : ఈ ఏడాదిలో అప్పుడే 5 నెలల్లోకి వచ్చేసాము. కరోనా తగ్గుదలతో ఈ ఏడాది స్టార్టింగ్ నుంచే కొద్దిగా సినిమాలు స్టార్ట్ అయ్యాయి. కానీ మెల్లగా అయితే ఫిబ్రవరి నెల నుంచే చెప్పుకోదగ్గ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ క్వార్టర్ 2022 సంవత్సరంలో రిలీజ్ అయ్యినటువంటి కొన్ని సినిమాలకి సంబంధించి వసూళ్లపై ఒక ఇంట్రెస్టింగ్ అంశం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
సినిమాలు బాగా చూసే వారికి అయితే పీవీఆర్ ప్రత్యేకంగా చెప్పాలిన పని లేదు. మరి వారి నుంచి ఈ ఏడాది మొదటి క్వార్టర్ నెలల్లో ఇండియా వడే దుమ్ము లేపిన సినిమాల తాలూకా వసూళ్లను బయటపెట్టారు. మరి ఇండియన్ వైడ్ రిలీజ్ అయ్యిన సినిమాలు సమయాల వారీగా చూసినట్టు అయితే ఈ స్క్రీన్స్ లో మొదటగా కోలీవుడ్ హిట్ సినిమా “వలిమై” తమిళ్ భాషలో 105 కోట్లు వసూలు చేసింది.
ఇక దీని తర్వాత రోజే వచ్చిన మన తెలుగు సినిమా “భీమ్లా నాయక్” 110 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకి తక్కువ టికెట్ ధరలతోనే ఈ రేంజ్ లో రావడం గమనార్హం. ఒకవేళ హైక్స్ ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేవి అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక వీటితో హిందీ చిత్రం గంగూ బాయి ఖాటియావాడి చిత్రానికి 127 కోట్లు వచ్చాయట.
ఇక హిందీలో మరో సెన్సేషనల్ హిట్ అయినటువంటి “కాశ్మీర్ ఫైల్స్” చిత్రం 250 కోట్లు అలాగే పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ అన్ని భాషల్లో కలిపి 104 కోట్లు ఫైనల్ గా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఏకంగా 750 కోట్లు వసూలు చేసినట్టుగా వారు తెలిపారు. దీనితో మార్చ్, ఏప్రిల్ వరకు దుమ్ము లేపిన సినిమాలుగా ఇవి నిలిచాయి.