అలియా భట్ సరసన జూనియర్ ఎన్టీయార్.?

తెలుగులో తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీయార్ అని బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా నటించింది అలియా భట్.

తెలుగులో మళ్ళీ అలియా ఇంకో సినిమా చేయలేదు. కానీ, త్వరలో జూనియర్ ఎన్టీయార్ సరసన అలియా భట్ నటించబోతోందట. అయితే, అది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. బాలీవుడ్ సినిమా అట.!

‘వార్-2’ కోసం తొలిసారిగా బాలీవుడ్‌కి వెళుతున్నాడు జూనియర్ ఎన్టీయార్. హృతిక్ రోషన్ ఈ సినిమాలో హీరో.! ఇక, ఇంకో బాలీవుడ్ సినిమాకి జూనియర్ ఎన్టీయార్ ఓకే చెప్పాడనే ప్రచారం జరుగుతోంది.

అసలు విషయమేంటంటే, అలియా భట్ స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతోందిట. ఈ సినిమాకి సంబంధించి, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశమట. ‘గంగూబాయ్’ తరహాలో వుంటుందట.

ఈ సినిమా కోసమే జూనియర్ ఎన్టీయార్‌ని అలియా భట్ సంప్రదించిందని అంటున్నారు. అయితే, ఇది మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే సినిమా అని సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీయార్ కీలక పాత్రలో కనిపిస్తాడట. అది కూడా, కొన్ని నిమిషాలే ఆ పాత్ర వుంటుందట.

టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానుందని తెలుస్తోంది. ‘గంగూబాయ్’ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర కూడా కీలకమే. సో, ఆ స్థాయిలో వుంటుందేమో జూనియర్ ఎన్టీయార్ రోల్.!