త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా.! కానీ, ఎందుకు.?

ట్రైలర్‌లో త్రివిక్రమ్ మార్కు లేదేంటి.? అన్న చర్చ ‘బ్రో’ సినిమాకి సంబంధించి గట్టిగా వినిపించింది. దాంతో, త్రివిక్రమ్ శ్రీనివాస్ అలకపాన్పు ఎక్కారా.? గత కొద్ది రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుస ఇది.

చిత్రంగా ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని సైతం ఆయన లైట్ తీసుకున్నారు. ‘బ్రో’ సినిమాకి సంబంధించి అన్నీ తానే అయి వ్యవహరించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ‘అన్న స్థానమే కాదు.. తండ్రి స్థానమూ మీకు ఇస్తున్నా..’ అని వేదికపై దర్శకుడు సముద్రఖని చెప్పిన సంగతి తెలిసిందే.

గురువు స్థానాన్ని ఏనాడో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఇచ్చేశారు. మరెందకు త్రివిక్రమ్, తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డుమ్మా కొట్టినట్లు.? పవన్, త్రివిక్రమ్ కలిసే వస్తారని అంతా ఎదురు చూశారు.

కానీ, ‘గుంటూరు కారం’ పనులతో బిజీగా వుండడం వల్లే, ‘బ్రో’ కోసం త్రివిక్రమ్ సమయాన్ని కేటాయించలేకపోయాడట. విదేశాల్లో మహేష్ వున్నాడు.. పర్సనల్ టూర్ నిమితం. మహేష్‌ లేని సన్నివేశాల్ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారట.