Prostate cancer: ప్రొస్టేట్ కాన్సర్ ముందుగా గుర్తించే లక్షణాలు ఇవే!

Prostate cancer: మగవారికి ఎక్కువగా వచ్చే కాన్సర్లలో ప్రొస్టేట్ కాన్సర్ ఒకటి. ఏసీ ప్రొస్టేట్ గ్రంధిలో నియంత్రణ లేకుండా కణ విభజన లేదా పెరుగుదల జరగడం వల్ల వస్తుంది. దురదృష్టవశాత్తు వ్యాధి చివరి దశ చేరే వరకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. ఇప్పటివరకు ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపించేది. అయితే ప్రస్తుతం అక్కడక్కడ తరచూ వింటున్నాం. మరి ఈ వ్యాది లక్షణాలు చివరి దశ వరకు కనిపించకపోవచ్చు. అయితే అంతర్లీనంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

• అంగ స్తంభన కష్టంగా ఉండటం.
• మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం
• మూత్రవిసర్జనలో నొప్పి లేదా మంట
• చుక్కలు చుక్కలుగా లేదా బొట్లు బొట్లుగా మూత్రం రావడం
• పురీష నాళం లేదా పొత్తి కడుపు , తొడ తుంటిలో నొప్పి.
ప్రొస్టేట్ కాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు స్పష్టంగా తెలియవు. జన్యు పరమైన కారణాల వల్ల డిఎన్ఏ లోని పరివర్తనల వల్ల కణ విభజన నియంత్రణ లేకుండా అవుతాయి.ఆన్కోజెన్లు అనే ముఖ్య కారకం మరియు కణతి జన్యువుల మధ్య సమతుల్యం లేకపోవడం ప్రధాన కారణాలు.

మూత్రాశయం ద్వారా నిర్వహించే బైయాప్సీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.డిజిటల్ మల పరీక్ష DRE, ప్రొస్టేట్ నిర్ధిష్ట యాంటీజెన్ PSA పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.ఈ పరీక్షల ద్వారా ప్రొస్టేట్ లో కాన్సర్లను గుర్తించలేము. ప్రొస్టేట్ కాన్సర్ కు ఇంతకు ముందు ఇండియాలో మెరుగైన చికిత్స లేదు ఇపుడిపుడే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాధికి చికిత్స సక్సెస్ రేట్ కూడా గణనీయంగా పెరిగింది.