Omicron: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Omicron: ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో రోజుకు దాదాపు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.సాధారణంగా జలుబు,దగ్గు, గొంతునొప్పి, అలసట వంటివి కరోనా లక్షణాలు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం దగ్గు, అలసట, ముక్కు కారటం వంటివి కరోనా సాధారణ లక్షణాలు.

ఇటీవల uk ఆధారిత జో కోవిడ్ ప్రొఫెసర్ ప్రకారం ఆకలి కోల్పోవడం కూడా కరోనా లక్షణాలలో ఒకటిగా పరిగణించారు.ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు వెన్నునొప్పి కూడా అనుభవిస్తున్నట్లు నివేదికలో తేలింది. అందువల్ల వెన్ను నొప్పిని కూడా కరోనా లక్షణాలలో ఒక లక్షణంగా భావించవచ్చు.

కొచ్చిలోని అమృత హాస్పిటల్ జనరల్ మెడికల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆన్ మేరీ ఈ నెల ప్రారంభంలో జరిగిన lANS కార్యక్రమంలో మాట్లాడుతూ ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు డెల్టా సోకిన వ్యక్తుల కంటే తక్కువగా వెన్ను నొప్పి తో బాధ పడుతున్నారని చెప్పుకొచ్చారు.

అందువల్ల ఒమిక్రాన్ నుండి కోలుకున్న తర్వాత కూడా వెన్నునొప్పితో బాధపడాల్సి వస్తుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల టేట్రోస్ అడొనమ్ కాప్రైస్ ఒమేగా వంటి కొత్త వేరియంట్లను పరీక్షించడం ముఖ్యమని WHO జనరల్ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.