Health Tips:గత రెండు సంవత్సరాల క్రితం చైనాలో వచ్చిన కరుణ వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ అనేక రకాలుగా రూపాంతరం చెంది ప్రజల మీద దాడి చేసింది. కరోనా వైరస్ రెండు, మూడవ వేవ్ లో ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాణనష్టం వాటిల్లింది. కరోనా మూడవ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందింది. అయినప్పటికీ మన భారతదేశంలో ఓమైక్రాన్ కారణంగా తక్కువ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మన భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
కానీ చైనా వంటి దేశాలలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం చైనాలో రోజురోజుకీ కరుణ కేసులు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే పలు ముఖ్యమైన నగరాలలో లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం పలు దేశాలలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్
‘XE Omicron’ పది రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కొత్త వైరస్ కు సంబంధించి ఇప్పటికే ఆరు వందల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గి ఊపిరి పీల్చుకున్న ప్రజలు నిర్లక్షం వహించకుండ జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) అధ్యయనాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్లు (XD, XF, XE) వ్యాప్తి చెందుతున్నాయి. ఒమిక్రాన్ XE లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.కరోనా వాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్నవారిని బట్టి, అలాగే వారిలో రోగనిరోధక శక్తి స్థాయి ఆధారంగా ఒక్కొక్కరిలో ఒక్కొలా వైరస్ లక్షణాలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.
ముఖ్యంగా ఈ కొత్త వైరస్ సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో మంట, దగ్గు, జలుబు, దురద, శ్వాస సంబంధిత సమస్యలు వంటి లక్షణాలు ఉంటున్నాయని గుర్తించారు. అలాగే ఈ వైరస్ తీవ్రత పెరిగితే.. వారిలో గుండె జబ్బులు, గుండెదడ, నరాల్లో తీవ్ర అనారోగ్యం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, చైనా, హాంకాంగ్ వంటి పలు దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మన భారతదేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది.