మన జీవితంలో కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉండాలి. అలా మారిస్తేనే మనం ట్రెండీగా కనిపిస్తాం. కానీ ట్రెండీ కనిపించేందుకు ఎక్కువ ఉపయోగిస్తే మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలంటే కొన్ని చిట్కాలు క్రమం తప్పకుండా పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం!
జీన్స్ ప్యాంట్ వాడడం వల్ల ఎందుకంటే మనం వాడే జీన్స్ పాయింట్ లూజుగా ఉంటే పర్వాలేదు కానీ టైట్ గా ఉండి బటన్స్ పెట్టుకోవడం వల్ల మనం తినే ఆహారం జీర్ణం కాకపోవడం, నరాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం,ఇంకా గర్భిణీ స్త్రీలలో గర్భ సమస్యలు, మూత్ర సమస్యలు, మగవారిలో శుక్ర కణాల సంఖ్య చాలా తగ్గిపోవడం వంటి సమస్యలకు లోను కావలసి వస్తుంది. లూజ్ పాంట్స్ ధరించడం మంచిది.
మొబైల్ ఫోన్ వాడడం. ఎందుకు అనుకుంటున్నారా. మొబైల్ ఫోన్ పగలు కాకుండా చీకటిలో వాడడం మంచిది కాదు. మొబైల్ ఫోన్ పడుకునే ముందు చీకటిలో వాడడం వలన కంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇంకా దీని ప్రభావం కంటిలోని రెటీనాపై, నరాలపై పడుతుంది. ఫోన్లోని బ్లూ స్క్రీన్ ఇంకా లైటింగ్ కారణంగా లిసోమియా అనే నిద్రలేమి వ్యాధికి గురికావలసి వస్తుంది. ఇంకా కంటికి కింద ముడతలు వచ్చి అందత్వం వచ్చే అవకాశం ఎక్కువ ఇంకా కళ్ళజోడు కూడా వాడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కావున మొబైల్ వాడేటప్పుడు వెలుతురులో ఉండి అలాగే కొన్ని లైటింగ్ తగ్గించే యాప్ లను వాడడం మంచిది.
పర్సు.. ఎందుకు అనుకుంటున్నారా. మనం వాలెట్ను ఎక్కువగా వెనుక జేబులో పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. అసలు విషయం ఇక్కడే దాగి ఉంది. పర్సును వెనుకాల జోబులో పెట్టుకొని కారు నడపడం, క్లాస్ రూమ్ లో కూర్చొని గంటలు గంటలు క్లాస్ వినడం. ఎందుకంటే కూర్చున్నప్పుడు బ్యాలెన్స్ గా లేక ఆ భారం అంతా వెన్నుముకపై పడడంతో సయాటిక్ అనే నరం దెబ్బ తిని వెన్నుముకలో నొప్పి వస్తుంది. కావున కూర్చునే ముందు పర్స్ ముందు జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. దాదాపు 70 నుండి 80 శాతం వరకు వెన్నుముకతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ.
ఇంకా మూత్రం ఆపుకోవడం. మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ క్లాసులు వినేటప్పుడు కానీ, మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు కానీ, మూత్రం ఆపుకోవడం జరుగుతుంది. ఇలా ఆపుకోవడం ఎప్పుడో ఒకసారి అయితే సరిపోతుంది. కానీ ఎక్కువసార్లు ఎక్కువసేపు ఆపుకోవడం వలన ఇందులోని బ్యాక్టీరియా ఇంకా బ్లాక్డార్ వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి వచ్చి మూత్ర సమస్యలు రావచ్చు.