తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు ధైర్యం ఇచ్చారు. పరీక్షలు తప్పామని ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు. వ్యవస్థలో లోపాలకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ.. నాడు నేడు అని మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన ప్రచారానికి, ఇప్పుడు వచ్చిన పదో తరగతి ఫలితాలు పొంతన లేదు అని అన్నారు.
రాష్ట్రం తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు విద్యార్థులు ఉత్తీర్ణత 90 నుండి 95 శాతం ఉందని.. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో 67 శాతానికి పడిపోవడంతో రాష్ట్రంలో ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనమని విమర్శలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్త విధానాల వల్ల ఈ పరిస్థితి కారణమని అన్నారు చంద్రబాబు నాయుడు.