AP: ముఖ్యమంత్రులుగా జగన్… చంద్రబాబు మధ్య తేడా అదే… జగన్ ఆ పని చేయలేకపోయారా?

AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా కొనసాగించారు. నాడు నేడు కింద హాస్పిటల్స్ స్కూల్స్ మరమ్మతులు చేయించారు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు విద్య వైద్యం గురించి ఆలోచన చేశారని చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 90% అమలు చేశారు.

ఇలా ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చినప్పటికీ ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలను అందించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఘోరాతి ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. గత ఎన్నికలలో 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో 164 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబుకు ఉన్న అనుభవమే కారణమా అంటే అవుననే చెప్పాలి.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. చంద్రబాబుకు ఎన్నికల్లో గట్టెక్కడం ఎలాగో తెలుసు. అలాగే జనాలను ఎన్నికల సమయంలో వాగ్దానాల ద్వారా తనకు అనుకూలంగా మలచుకునేందుకు అవకాశముంది.. కానీ క్యాడర్ విషయంలో మాత్రం చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆ హామీలన్నింటినీ పక్కన పెట్టిన ఈయన తన అనుకునే వారికి మాత్రం వీలైనంతవరకు మంచే చేస్తూ ఉంటారు.

ఒక పార్టీ మనుగడ సాగించాలి అన్న అధికారంలోకి రావాలన్న క్యాడర్ ఎంతో ముఖ్యం. గ్రామస్థాయిలో ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చి వారి చేత ఓట్లు వేయించేది క్యాడర్ కావడంతో క్యాడర్ విషయంలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వారికి ప్రాధాన్యత కల్పిస్తారు అందుకే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడంతో క్యాడర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడి పార్టీ జెండా పట్టుకున్న వారిని దూరం పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఘోర ఓటమి ఎదుర్కొన్నారు. ఇలా గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరుస్తూ వారిని పార్టీ కోసం పని చేయించుకునే విషయంలో చంద్రబాబుకు ఉన్న అనుభవం జగన్మోహన్ రెడ్డికి లేదని ఇదే అధికారం మారటానికి కూడా కారణమైందని చెప్పాలి.