Health Tips: నల్లవెల్లితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మీరు కూడా తింటారు..!

Health Tips: వంటింట్లో లభించే కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల శరీరం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వీటిలో ముఖ్యమైనది వెల్లుల్లి. వెల్లుల్లిని తరచూ వంటలలో వినియోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, ఆహారాన్ని రుచి గా మార్చడంలో సహాయపడుతుంది. పురాతన కాలం నుండి వెల్లుల్లిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి ఆరోగ్యాన్ని సంరక్షించే అనేక రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అయితే మనకు సాధారణంగా తెల్ల వెల్లుల్లిని వినియోగించటం తెలుసు, కానీ నల్లవెల్లుల్లి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. తెల్ల వెల్లుల్లితో పోల్చితే నల్లవెల్లి లో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

తెల్ల వెల్లుల్లి ని 15 రోజుల పాటు ఉడికించి, పులియపెట్టడం (కిన్వ ప్రక్రియ అంటారు) వల్ల ఇది నల్ల వెల్లుల్లి గా మారుతుంది. తెల్ల వెల్లుల్లి కంటే నల్లవెల్లుల్లి లో అధిక పోషక పదార్థాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా నల్ల వెల్లుల్లిలో అధిక మొత్తంలో లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తినటం వల్ల అల్జీమర్స్ నుండి క్యాన్సర్ వరకు అన్ని ప్రమాదకర వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు.

నల్లవెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది. ఫలితంగా రక్త ప్రవాహాన్ని పెంచేటప్పుడు మీ గుండె, ధమనుల వాపును తగ్గిస్తుంది. వీటిని తినటం వల్ల రక్తపోటు సమస్య కూడా నియంత్రణలో ఉండి గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.

నల్లవెల్లుల్లి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా రక్షిస్తుంది. నల్లవెల్లుల్లి కాలేయం పనితీరును మెరుగుపరిచి, కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నల్ల వెల్లుల్లి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. నల్ల వెల్లుల్లి లో ప్రోయోబెటిక్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనివలన డయాబెటిస్ అదుపులో ఉండటమే కాకుండా… డయాబెటిస్ వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది.