Health Tips: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం, కలుషితమైన ఆహారపదార్థాల తీసుకోవటం, పని ఒత్తిడి, నిద్రలేమి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య లో బీపీ సమస్య ప్రధానమైనదిగా భావించవచ్చు. ఈ సమస్యలను నియంత్రించడానికి మన ఇంట్లో ఉండే మసాలా దినుసులలో ఒకటైన నల్లమిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.
నల్లమిరియాలు చూడటానికి చిన్నగా నలుపురంగులో ఉన్నప్పటికీ వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మిరియాలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. నల్ల మిరియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడయ్యింది. మిర్యాల లో ఉండే ఎన్నోరకాల ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
ప్రతిరోజు మిరియాల తో తయారు చేసిన టీ తాగటం లేదా మనం తినే ఆహారంలో మిరియాలను జత చేసుకోవటం వల్ల గతంలో ఉన్న కొవ్వును కరిగించి బిపి కంట్రోల్లో ఉంచుతాయి. హైబీపీ సమస్యతో బాధపడేవారు మిరియాల ద్వారా వారి సమస్యను అదుపు చేయవచ్చు. మిరియాల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మిరియాల చారు చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
కీళ్ల నొప్పులు, అరికాళ్ళ మంటలు వంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలను మెత్తగా పొడి చేసి నూనెతో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మిరియాలను కలిపి తీసుకోవడం ద్వారా నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ప్రతిరోజు మిరియాల తో తయారుచేసిన టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి శరీర బరువును తగ్గిస్తాయి.