కదులుతున్న కుప్పం కూసాలు.. మొదలైన రాజీనామాల పర్వం

Chandrababu was severely defeated in his own constituency

 బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి అనేది రాజకీయల్లో ఎప్పుడు వినిపించే మాట. తాజాగా ఇలాంటి పరిస్థితి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఎదురైంది. దాదాపు 35 ఏళ్ల నుండి 7 సార్లు ఎమ్మెల్యే గా తనని గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు బాబుకు ఎదురుగాలి వీస్తున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.

cbn

 

 తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ పరిధిలోని 89 పంచాయతీల్లో కేవలం 14 చోట్ల మాత్రమే విజయం సాధించిన టీడీపీ సానుభూతి పరులు, దాదాపు 70 పైగా స్థానాల్లో ఓడిపోవటం జరిగింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరాభవం ఎదురుకావటాన్ని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. దీనితో అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుకునే పోస్టుమార్టం జరుగుతుంది.

 కుప్పంలో ఇలాంటి ఫలితాలు రావటంతో కంగుతిన్న చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26, 27 తేదీల్లో కుప్పం పర్యటనకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు పర్యటన నేపధ్యంలో… పార్టీ కార్యాలయంలో కుప్పంలో సమావేశం నిర్వహించగా … 89 పంచాయతీల్లో పోటీ చేసి ఓడిపోయిన 74 మంది, గెలిచిన 14మంది వచ్చారు.

 ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నేతలను టార్గెట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. మీ వల్లే ఓడిపోయామని, ధైర్యం చెప్పలేకపోయారని వాళ్ళు నిలదీశారు. దీనితో ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక నాయకులు అందరూ రాజీనామాలు చేసేస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఓటమికి కారణమని చెప్పడంతో వాళ్ళు రాజీనామాలు చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ రాజీనామాలు ఇంతటితో ఆగేలా లేవని తెలుస్తుంది. ఇన్ని రోజులు చంద్రబాబు కు పెట్టని కంచుకోటగా ఉంటున్న కుప్పం యొక్క కూసాలు ఇప్పుడు మెల్లగా కదలటం స్టార్ట్ అయ్యాయి. మరి బాబు దీనిని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.