Crime News: దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఏటీఎం చోరీ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏటీఎంల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ అదను చూసుకొని కొందరు దొంగలు ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల భువనేశ్వర్లో కూడా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే…భువనేశ్వర్‌లో ఇందిరా కాలనీ లోని ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొహానికి మాస్క్ పెట్టుకుని ఏటీఎం లోకి ప్రవేశించిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆపై మూడు క్వింటాళ్ల బరువుండే క్యాష్ టెల్లర్ మెషీన్‌ను ఎత్తుకెళ్లారు.
ఊరు శివారుకి క్యాష్ టెల్లర్ మెషీన్ తీసుకెళ్లి ఏటీఎంల వన్డే 20 లక్షల నగదును తీసుకుని తర్వాత హౌసింగ్ బోర్డు సమీపంలోని నిర్జన ప్రదేశంలో ఏటీఎం మెషీన్‌ను పడేశారు. ఏటీఎం దొంగతనం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.