మనలో చాలామంది నగదు లావాదేవీలను నిర్వహించడం కోసం ఏటీఎం ద్వారా లావాదేవీలను నిర్వహించడానికి ఇష్టపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంలో డబ్బులు రాకుండానే మనీ కట్ అయ్యాయని మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా జరిగితే టెన్షన్ పడాల్సి ఉంటుంది. టెక్నికల్ సమస్యల వల్ల మెజారిటీ సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
అయితే మన తప్పు లేకుండా అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయని చూపించినా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ సమస్య ఎదురై బ్యాంకులో ఫిర్యాదు చేస్తే లావాదేవీ జరిగిన ఐదు రోజుల్లో ఖాతాలో నగదు జమవుతుంది. ఈ సమయంలోగా డబ్బులు అకౌంట్ లో జమ కాకపోతే బ్యాంక్ ఫైన్ ను చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించలేని వాళ్లు బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయవచ్చు.
రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంక్ ఫైన్ చెల్లించాల్సి ఉండటంతో బ్యాంక్ అధికారులు సైతం ఇలాంటి సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ట్రాన్సాక్షన్ సమయంలో వచ్చిన స్లిప్, మెసేజ్ అధారంగా సమస్య సులభంగా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏటీఎంలో తగినంత డబ్బు లేకపోయినా కొన్నిసార్లు ఈ విధంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది.
వీలైనంత వరకు సొంత బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంను సంప్రదించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లావాదేవీలు లిమిట్ దాటి చేయడం కూడా మంచిది కాదు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలో సమస్య ఎదురైతే ఏడు రోజుల్లో సమస్య పరిష్కారమై నగదు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.