టీడీపీ నేతల అరెస్ట్ ల జోరు కాస్త తగ్గుముఖం పట్టిందిప్పుడు. అయినా ఇప్పటికే పలువురు సీనియర్ నేతలపై కేసులు ఉన్నాయి. ఏ క్షణమైనా అరెస్ట్ లు జరగొచ్చని తెలుస్తోంది. అవినీతికి పాల్పడ్డ టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నప్పటికీ కొంత మంది నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమపై ఇప్పటికే అవినీతి ఆరోపణలపై బ్యాకెండ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఇప్పటికే మీడియా కథనాలు వెడేక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉమ చుట్టూ పుష్కరాలు చుట్టుకుంటున్నాయి. కృష్ణా పుష్కరాల ఘాట్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం అదేశించింది.
ఈఎస్ ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుని తోలుత విజులెన్స్ అధికారుల ద్వారానే విచారణ జరిగింది. ఆ తర్వాతే ఏసీబీ ఎంటరై కీలక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసింది. అంటే ఇప్పుడు దేవినేని ఉమపై కూడా అలాంటి అపరేషనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ ప్రమేయం ఘాట్ నిర్మాణంలో ఉందని వైసీపీ ప్రభుత్వం విచారణకు అదేశించినట్లు తెలుస్తోంది. 2016 లో కృష్ణా పుష్కరాలు జరిగాయి. మొత్తం 34 పుష్కర ఘాట్లు, 24 పుష్కర్ నగరాలను నిర్మించింది.
వీటిని టెండర్లు లేకుండానే పనులు అప్పగించడం తో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కర్ విజులెన్స్ విచారణకు అదేశించింది. అయితే విజులెన్స్ విచారణ నామమాత్రమే అయినప్పటికీ ఆతర్వాత ఏసీబీ రంగంలోకి దిగుతుందని.. ఆతర్వాత ఒక్కొక్కటిగా ఉమ బండారం బయట పెట్టడమే అసలు ప్లాన్ గా తెలుస్తోంది. మొత్తానికి ఉమ దూకుడికి ఈసారి కళ్లెం పడటం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ చేతిలో సాలిడ్ ప్రూప్ ఉన్నట్లు తెలుస్తోంది.