Kodali Nani: వైసీపీ పార్టీ డాషింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం ‘గ్యాంబ్లింగ్’ వివాదంలో నానుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఆడుకునే నానిని ఇప్పుడు అందరూ ఆడేసుకుంటున్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమ కొడాలి నాని గ్యాంబ్లింగ్ వ్యవహారంపై విరుచుకుపడ్డారు.
తన ట్విట్టర్ ఖాతాలో “గుడివాడలో యథేచ్ఛగా సాగుతున్న గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్. గోవాను తలదన్నే రీతిలో “క్యాసినో” ఏర్పాటుచేసిన మండపం ఎవరిది? ధాన్యానికి మద్దతు ధర లేక, అమ్మినవాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే…నయా దందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?” అంటూ సీఎం వైఎస్ జగన్ గారిని ట్యాగ్ చేసి గ్యాంబ్లింగ్ కు సంబందించిన ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు.
గుడివాడలో యథేచ్ఛగా సాగుతున్న గడ్డంగ్యాంగ్ గ్యాంబ్లింగ్. గోవాను తలదన్నే రీతిలో"క్యాసినో" ఏర్పాటుచేసిన మండపం ఎవరిది? ధాన్యానికి మద్దతుధర లేక, అమ్మినవాటికి డబ్బులురాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయాదందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యంఉందా? @ysjagan pic.twitter.com/KY2npgxi56
— Devineni Uma (@DevineniUma) January 17, 2022
గుడివాడలో జరుగుతున్న గ్యాంబ్లింగ్ కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి జరగడంలేదని ప్రశ్నించేవారికి ఈ క్యాసినోను చూపించాలని, పేదవారికి అందుబాటులోకి క్యాసినోలను తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని, గోవా వెళ్లి క్యాసినోలు ఆడితే ఏపీలో కరోనా కేసులు పెరుగుతాయని ముందుచూపుతో రాష్ట్రానికే క్యాసినోని తీసుకొచ్చారని అంటూ వైసీపీ ప్రభుత్వంపై నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.