Crime News: ప్రస్తుత కాలంలో కొంతమంది మగవాళ్ళు కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు లేకుండా చిన్నపిల్లలు ముసలివారు అని తేడా లేకుండా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి నుండి ఆడ వారిని రక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటువంటి సంఘటన ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో మహారాష్ట్రలో గతేడాది ఒక కామాంధుడు మద్యం మత్తులో కళ్ళు మూసుకుపోయి వావి వరసలు చూడకుండా కన్నతల్లి మీదే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత సంవ్సరం ఆగష్టు లో ఈ ఘటన చేటుచేసుకోగా ఆ కసాయి కుమారిడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసును కోర్టు త్వరగా విచారించి నేరస్థుడికి శిక్ష విధించింది. జనవరి 19 న కోర్టు సాక్షాలను పరిశీలించి, జనవరి 24వ తేదీ నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. జనవరి 31వ తేదీన ఈ కేసు మీద కోర్టు తుది విచారణ జరిపి నిందితుడిని శిక్షించింది.
శిక్ష విధిస్తున్నప్పుడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి షబ్బీర్ అహ్మద్ ఔటి.. నిందితుడికి సాధారణ జైలు శిక్ష విధించి, జీవితాంతం జైలులో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు నిందితుడికి రెండు వేల రూపాయల జరిమానా, బాధితురాలికి రెండు లక్షల రూపాయలు అందించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాగుడికి బానిస కావడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయి తల్లి అని కూడా చూడకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.