మనిషి అనేవాడు తప్పు చేయటం సహజమే, అయితే చేసిన తప్పులను తెలుసుకొని వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు గొప్పోడు, అలాంటి గొప్ప లక్షణాలు సీఎం జగన్ లో పుష్కలంగా వున్నాయి. మొదటిసారి అధికారంలోకి రావటంతో పరిపాలన పరంగా చిన్న చిన్న తప్పులు జరగటం సహజం, అదే సమయంలో ఇతర నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు చేసే పనులకు సీఎం హోదాలో జగన్ సమాధానం చెప్పాల్సి వస్తుంది.
ఈ క్రమంలో జరుగుతున్నా తప్పులను తెలుసుకొని వెంటనే వాటిని సరిదిద్దుకొని అద్భుతమైన పాలన అందించే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ప్రభుత్వం చేప్పట్టబోతున్న సమగ్ర భూ సర్వే లో వేయబోతున్న హద్దు రాళ్ల విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. వాటిపై జగన్ బొమ్మ చెక్కించి వాటినే వేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వ పెద్దలు తప్పు ఎక్కడ జరిగిందో తేల్చారు. కొందరి అధికారుల అత్యుత్సహమే ఇందుకు కారణమని, చీమకుర్తి గ్రానెట్ ను సెలెక్ట్ చేసి, అక్కడే జగన్ బొమ్మను చెక్కించి దానిని సీఎం జగన్ కు చూపించాలని అమరావతికి తీసుకోని రావటం చూసి, ప్రభుత్వ పెద్దలు షాక్ తిన్నారు.
ఇందుకు భాద్యులైన అధికారులను హెచ్చరించి, సర్వే రాళ్లపై సీఎం చిత్రాలను పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సర్వే రాళ్ల పై జగన్ బొమ్మ విషయంలో పెద్ద రాద్ధాంతం చేయాలనీ చూస్తున్న ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకుండా, తప్పు ఎక్కడ జరిగిందో దానిని గుర్తించి, తప్పును సరిచేయటం గొప్ప విషయం.. ఈ ఒక్క సంఘటనలోని కాదు అనేక సంఘటనల్లో కూడా అనుకోకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే ఎలాంటి బేజాషలు లేకుండా వాటిని జగన్ సర్కార్ సరిచేయటం జరిగింది. అదే గొప్ప నాయకుల యొక్క లక్షణం. విమర్శను కావచ్చు, ప్రశంసను కావచ్చు సీఎం జగన్ ఒకేలా స్వీకరిస్తాడు, ఆ లక్షణమే జగన్ ను అందరి నేతలకంటే కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది.