Goa: తీర ప్రాంత రాష్ట్రమైన గోవాలో కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఓమిక్రాన్ తొలి కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. UK నుండి గోవాకు వచ్చిన ఎనిమిదేళ్ల బాలుడు ఓమిక్రాన్ బారిన పడ్డాడు. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వచ్చిన పరీక్ష నివేదిక ప్రకారం, డిసెంబర్ 17, 2021 న యుకె నుండి గోవాకి చేరుకున్న బాలుడికి ఓమిక్రాన్ సోకినట్లు నిర్ధారించబడింది. దీంతో ఓమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన రాష్ట్రాల జాబితాలోకి గోవా కూడా చేరింది.
కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అవసరమైన మేరకు కఠిన చర్యలు తీసుకుంటుందని గోవా రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే సోమవారం తెలిపారు చెప్పారు. రాబోయే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో, ఉత్సవాల సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నిబంధనలను అమలుచేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇప్పటికే పర్యాటక శాఖని కోరారు.
ఆదివారం, గోవాలో 25 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,80,050కి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం మరణాల సంఖ్య 3,519గా ఉంది. దేశంలో పర్యాటక ప్రదేశాల జాబితాలో టాప్ లో ఉండే గోవాలో కూడా కొత్త వేరియంట్ బయటపడటంతో లోకల్, పర్యాటకులు కలవరపడుతున్నారు. ఎంజాయిమెంట్ కు హబ్ గా ఉండే గోవాలో న్యూ ఇయర్ తర్వాత కేసులు ఎక్కువగా బయటపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.