PUBG: పబ్ జీకి బానిసై కుటుంబ సభ్యులను కడతేర్చిన బాలుడు..!

PUBG: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు పెద్ద వారు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలు సంగతి ఏమో కాని, నష్టాలు మాత్రం అధికంగా ఉన్నాయి. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలు వాటికి బానిసై ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటి మూలంగా పిల్లల చదువు కూడా అటక ఎక్కుతోంది. ఏ వస్తువునైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకుని అప్పుడు వాటి వల్ల మనకు లాభం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ వినియోగం వల్ల నష్టాలే మిగులుతున్నాయి. తాజాగా బాలుడు పబ్ జీ ఆటకు బానిసే మతిస్థిమితం లేకుండా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల పాకిస్తాన్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన 45ఏళ్ల నహిద్‌ ముబారక్‌ హెల్త్‌ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఈమెకు నలుగురు పిల్లలు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త నుండి విడిపోయి నలుగురు పిల్లలతో కలిసి విడిగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు తైమూర్‌ కి21 సంవత్సరాలు. 17,11 సంవత్సరాలు గల ఇద్దరు కుమార్తెలు , చివరగా ఒక మైనర్ బాలుడు ఉన్నారు. చిన్న కుమారుడికి ఆన్లైన్లో పబ్ జీ గేమ్ గేమ్ ఆడటం బాగా అలవాటు అయిపోయింది. రాను రాను ఆ బాలుడు పబ్ జీ ఆటకు బానిస అయిపోయాడు.

పబ్ జి గేమ్ కు బానిసైన చిన్న కుమారుడు తరచూ ఆన్లైన్లో పబ్ జీ గేమ్ ఆడుతూ ఉండేవాడు. దీనిని గమనించిన అతని తల్లి పలుమార్లు తన చిన్న కుమారుడిని మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఒకరోజు ఇదే విషయం మీద నహీద్ బాగా కోపం ప్రదర్శించింది. పబ్ జీ ఆటకు బాగా బానిసైన బాలుడు తన తల్లి కోపగించుకొవటం తో బాగా ఆగ్రహానికి లోనే కబోర్డ్ లో ఉన్న తుపాకీతో తన తల్లి ,అన్న, ఇద్దరు అక్కలను కాల్చిచంపాడు. నలుగురు ని చంపిన తర్వాత బాలుడు బయటికి వచ్చి తన కుటుంబాన్ని ఎవరో హత్య చేశారని పొరిగింటి వారికి తెలియజేశాడు.

వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని విచారించారు. మొదట బాలుడు ఈ సంఘటన జరిగిన సమయంలో తాను మేడపై ఉన్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులకు అనుమానం వచ్చి కాస్త గట్టిగా విచారించడంతో తన కుటుంబ సభ్యులను తానే చంపినట్టు నిజం బయట పెట్టాడు. వారిని చంపిన తర్వాత తుపాకిని దగ్గర్లో ఉన్న మురికి కాలువలో పడేశారని బాలుడు పోలీసులతో చెప్పాడు. పబ్ జీ ఆటకు బానిస అవ్వడం వల్ల ఆ బాలుడి మతిస్థిమితం సరిగా లేకపోవటంతో కుటుంబ సభ్యులను కాల్చి చంపాడని పోలీసులు వెల్లడించారు.