Kodali Nani : మంత్రి కొడాలి నాని ఆవేదన, ఆవేశం వెనుక కారణం ఇదీ.!

Kodali Nani : మంత్రి కొడాలి నాని ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనకు హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించారు. ఆ వ్యవహారాలన్నిటినీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చూసుకున్నారట. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని స్వయంగా వెల్లడించారు.

ఆ వల్లభనేని వంశీ స్నేహితుల వల్లనే ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న ‘కాసినో’ వివాదం తెరపైకొచ్చింది. ‘వాళ్ళు మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్..’ అంటూ కొడాలి నాని తాజాగా చెప్పడం గమనార్హం. ‘కేవలం గుడివాడలోనే కాదు, గన్నవరంలోనూ, మరికొన్ని చోట్ల కూడా కాసినో వ్యవహారాలు నడిచాయి. నా కన్వెన్షన్ సెంటర్‌లో అవి జరగలేదు. అవి ఎక్కడ జరిగాయో నేను గుడివాడ వెళితే తెలుస్తుంది..’ అన్నారు కొడాలి నాని.

ఇక్కడ మేటర్ క్లియర్. గుడివాడలో కాసినో నిర్వహణ జరిగింది. ఆ విషయాన్ని కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నారు. అయితే, మహిళల అర్థనగ్న నృత్యాలైతే గుడివాడలో జరగలేదట.. మహిళలతో వ్యభిచార కార్యకలాపాలూ గుడివాడలో జరగలేదట. అలాగని మంత్రి కొడాలి నాని కుండబద్దలుగొట్టేశారు.

‘మా ఎమ్మెల్యే సంక్రాంతి పండక్కి సంబరాలు చేయలేకపోయారు..’ అని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టే, ఎమ్మెల్యేలు తప్పని తెలిసినా, ఇలాంటివాటి నిర్వహణకు ఓకే చెప్తారు.. గుడివాడలో నేను అందుబాటులో లేను కాబట్టి, వల్లభనేని వంశీ అవి చేయించి వుంటాడని కొడాలి నాని చెప్పడం గమనార్హం.

ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా కాసినో ఆరోపణలు రాకపోవడం, గుడివాడ కేంద్రంగా రచ్చ జరగడంతోనే కొడాలి నాని గుస్సా అయ్యారు. అంటే, వల్లభనేని వంశీ అత్యంత వ్యూహాత్మకంగా కొడాలి నానిని ఇరికించేశారా.? అయినాగానీ, అదేమీ పెద్ద సమస్య కాదని కొడాలి నాని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?