Vishwak Sen: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలు చేసి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలా తెలుగులో ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, అశోక వనంలో అర్జన కల్యాణ్ం, దాస్ కా దమ్కీ, గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ వంటి సినిమాలలో నటించారు. కాగా చివరగా లైలా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు విశ్వక్.
రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీనికి తోడు విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కూడా ఈ సినిమాను వార్తల్లో నిలిచాయి. అయితే భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 14వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా దెబ్బకు లైలా దెబ్బకు విశ్వక్ సేన్ కూడా డీలా పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై కథల ఎంపికల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని అభిమానులకు వివరణ ఇచ్చాడు. అయితే లైలా సినిమాకు హీరోగా విశ్వక్ సేన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అతని కంటే ముందు ఏకంగా నలుగురు హీరోలకు ఈ కథను చెప్పారట మూవీ మేకర్స్. అయితే సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ రోల్ లో కనిపించాల్సి ఉండడంతో సదరు హీరోలు సినిమాను రిజెక్ట్ చేశారట. సినిమా ప్రమోషన్లలో హీరో విశ్వక్ సేనే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. కానీ ఆ హీరోల పేర్లు మాత్రం వెల్లడించలేదు.