Laila Movie: లైలా వివాదంలోకి బుల్లి రాజు… బూతులతో రెచ్చిపోతున్న ఫాన్స్?

Laila Movie: లైలా మూవీ ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది. ఒక వ్యక్తి నోటి దూల కారణంగా సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చుకుంటూ పరోక్షంగా వైకాపా పై విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఈ చిత్రం వివాదంలో నిలిచింది. వైయస్సార్ పార్టీ గురించి పృథ్విరాజ్ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా అభిమానులు ఏకంగా ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఇలా ఈ సినిమా వివాదం నెలకొన్న నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బాల నటుడిగా అందరిని మెప్పించిన పవన్ సాయి సుభాష్ ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించి మెప్పించిన బుల్లి రాజు ఈ సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక ఈయనకి వచ్చిన ఈ ఫేమ్ కారణంగా లైలా సినిమా ప్రమోషన్ల కోసం కూడా బుల్లి రాజును పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు.

ఇలా లైలా సినిమా కోసం బుల్లి రాజు ప్రమోషన్స్ చేయడంతో కొంతమంది బుల్లి రాజు అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైకాపా అభిమానులకు తీవ్ర స్థాయిలో కోపం తెప్పించింది. దీంతో వైకాపా అభిమానులు బుల్లి రాజును టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.

బుల్లి రాజు అనే పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ ఎక్కౌంట్ లో పెట్టిన పోస్ట్ లో …అరేయ్ పేటీఎమ్స్ మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు మా లైలా పిన్ని కోసం నేనున్నా . అందుకే నేను ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నా అంటూ వీడియోని షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. అయితే ఇది ఫేక్ అకౌంట్ అని తెలుస్తోంది ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కొంత మంది బుల్లి రాజును కూడా ఈ వివాదంలోకి నెట్టేసారని స్పష్టమవుతుంది ఏది ఏమైనా బుల్లి రాజు ఈ వివాదం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.