ఆ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది .. లేదంటే ఎంత నష్టం జరిగేదో తెలుసా ?

Ministers facing problems with that one man

 గత రెండు మూడు రోజల నుండి విశాఖ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయని, వైసీపీ పార్టీలో నెంబర్ 2 ఉత్తరాంధ్ర జిలాల్ల ఇంచార్జి, ఎంపీ అయినా విజయసాయి రెడ్డికి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమరనాధ్ మధ్య వాదనలు జరిగినట్లు, పాలవలస భూముల విషయం విషయంలో రాజకీయ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ విజయసాయి రెడ్డి నేతల పేర్లు చెప్పకుండా సమావేశంలో మాట్లాడటంతో కలగచేసుకున్న ఎమ్మెల్యే లు మీరు పేరు చెప్పకుండా నేతలందరూ మేము కూడా అక్రమాలకు పాల్పడ్డాడేమో అనే అనుమానాలు అందరికి వస్తాయి, ఏమైనా అనాలి అనుకుంటే ఆయా నేతల పేర్లు చెప్పి మాట్లాడండి అంటూ ఎమ్మెల్యే లు అనటంతో వాళ్ళకి విజయసాయి రెడ్డి కి మధ్య మాట మాట పెరిగినట్లు వార్తలు వచ్చాయి.

Vijayasai reddy

 ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించి గొడవ గురించి మాట్లాడినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనితో వైసీపీ లోనే ఇలాంటి విభేదాలు ఏంటి..? విజయసాయి రెడ్డి మీద వ్యతిరేకత వస్తుందా..? ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి అనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఎమ్మెల్యే వాటికీ చెక్ పెట్టే ప్రయత్నాలు చేశాడు .డిఅర్సీలో మాదంతా ఓపెన్ అన్నారు. ప్రతిపక్షం లేదు కదా.. ఆ భాద్యత కూడా మేమే వహించాలి అని ఆయన పేర్కొన్నారు. ఎవరిమీదా ద్వేషమో, అక్కసో మాకు లేదు అని, పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవు అని స్పష్టం చేసారు. ప్రజాప్రతినిధులుగా మా బాద్యత మేము నిర్వర్తించాలి..పాలవలస భూములు నూరుశాతం జెన్యూన్ అని స్పష్టం చేసారు. అది అసైన్డ్ భూమి కాదు… ఎక్స్ సర్వీస్ మెన్ కు అలాట్ చేసిన ల్యాండ్ అన్నారు.

 ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయించారు అని పేర్కొన్నారు. డిఆర్సీ వివాదంపై సిఎమ్ తో భేటీ అయిన విషయం అవాస్తవం… నేను కూడా టివీల్లో స్క్రోలింగ్ చూశాను అన్నారు.. అయితే ఇక్కడ సీఎం తో భేటీ కాలేదని మాత్రమే చెప్పుకొచ్చాడు కానీ, విజయసాయి రెడ్డితో గొడవ గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యే లు సీఎం జగన్ తో భేటీ అయ్యారని వార్తలు వచ్చిన అనంతరం హుటాహుటిన విశాఖలోని ప్రభుత్వ వసతి గృహంలో విశాఖకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ , ముఖ్యనేతలతో విజయసాయి రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. వాటి గురించి కూడా ఎమ్మెల్యే ధర్మ శ్రీ మాట్లాడలేదు… అయితే చివరికి ఈ విషయంలో ఎలాంటి ఇష్యూ జరగలేదనట్లు ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వటంతో ఇప్పటికి ఆ వివాదం సర్దుమణిగిందనే అనుకోవాలి.