OTT Movie: ఓటీటీలోకి మరో హార‌ర్ మూవీ.. ద‌య్యం బంగ‌ళాలోకి అడుగుపెట్టిన విఘ్నేష్ శివ‌న్.. తర్వాత ఏం జరిగిందంటే!

OTT Movie: ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎక్కువ శాతం మంది హర్రర్ మూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. అయితే హర్రర్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు విడుదల అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త హారర్ మూవీలను కోరుకుంటున్నారు. హర్రర్ నేపథ్యంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమాను కూడా అభిమానులు హిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలో థియేటర్లలో సక్సెస్ అయ్యి ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హర్రర్ మూవీ సడన్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఆ సినిమా ఏది అన్న విషయానికి వస్తే..

స‌చిన్ మ‌ణి, అబ‌ర్న‌తి హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం డీమన్. ఇందులో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. రమేష్ ప‌ళ‌నీవేల్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2023 సెప్టెంబ‌ర్‌ లో త‌మిళంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ ల‌తో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివ‌న్ తాను తీయ‌బోతున్న హార‌ర్ మూవీ కోసం క‌థ రాసే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు.

ఎలాంటి డిస్ట్ర‌బెన్స్ లేకుండా క‌థ రాసుకోవ‌డానికి సిటీ మ‌ధ్య‌లో ఉన్న కొత్త బంగ‌ళాకు షిప్ట్ అవుతాడు. ఆ బిల్డింగ్‌ లో నిద్ర‌పోయిన త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌కు విచిత్ర‌మైన క‌ల‌లు వ‌స్తుంటాయి. ఒక ద‌య్యం అత‌డిని చంప‌డానికి చూస్తుంది. నిజంగానే బిల్డింగ్‌ లో ద‌య్యం ఉందా? ఆ బిల్డింగ్ మిస్ట‌రీని విఘ్నేష్ శివ‌న్ ఎలా ఛేదించాడు? విఘ్నేష్ ప్రేమించిన కార్తీక‌కు, ఆ ద‌య్యానికి ఉన్న సంబంధం ఏమిటి? విఘ్నేష్ డైరెక్ట‌ర్ అయ్యాడా? లేదా? అన్న‌దే డీమ‌న్ మూవీ క‌థ‌. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చివరికి ఏమయింది అన్నది తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది.