‎OTT Movie: ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు లేటెస్ట్ రొమాంటిక్ మూవీ.. రెండు రోజుల్లోనే అలా!

‎OTT Movie: ఇటీవల కాలంలో ఎక్కువగా కంటెంట్ బలంగా ఉన్న సినిమాలు బాగా విజయాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యకాలంలో విడుదల అవుతున్న సినిమాలన్నీ కూడా కంటెంట్ బాగానే ఉంటున్నాయి. అటువంటి సినిమాలను కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు మనం థియేటర్లలో చూసిన ఒక సినిమా కూడా మంచి కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు భారీ విజయాన్ని అందుకుంది.

‎ అయితే ఆ సినిమా థియేటర్లలో విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలు కేవలం రూ.2.4 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు వసూల్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డులు తిరగరాస్తోంది. ఆ సినిమా మరేదో కాదు లిటిల్ హార్ట్స్. మౌళి తనూజ్, శివానీ నాగారం నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

‎అయితే థియేటర్ల కంటే అదనపు రన్ టైమ్ తో ఈ మూవీ ప్రీమియర్ అవుతోంది. విడుదల అయిన తొలి రెండు రోజుల్లోనే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ 100 మిలియన్స్ అంటే దాదాపు 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డ్ అందుకుంది. కాగా థియేటర్స్ లో విడుదల అయిన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ గా మౌత్ టాక్ వచ్చింది. తక్కువ సమయంలోనే భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.