తెలంగాణ రాష్ర్ట హోమంత్రి మహమూద్ అలీ కి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన్ని జూబ్లీ హిల్స్ లో ని అపోలో ఆసుపత్రికి తరలించి కొవిడ్ వైద్యం అందిస్తున్నారు. ఆదివారం రాత్రి అలీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు కరోనా రావడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారందరు ఆందోళ చెందుతున్నారు. ఇప్పటికే కొందరు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. లక్షణాలు కనిపించిన వాళ్లు ప్రభుత్వం కల్పించిన క్వారైంటన్లో ఉన్నట్లు తెలిసింది. అయితే వీళ్లందరికి పరీక్షలు నిర్వాహించాల్సి ఉంది. హోమంత్రికి కరోనా రావడానికి కారణం ఆయన గన్ మెన్ అని తెలుస్తోంది.
నాలుగైదు రోజుల క్రితం హోమంత్రి గన్ మెన్ వైరస్ బారిన పడ్డారు. అనుమానం వచ్చిన అలీ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సందేహం ఉన్న వాళ్లం తా క్వారంటైన్ కు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అయితే కరోనా వృద్దులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుండటంతో వృద్ధ రాజకీయ నాయకులు ఇంకాస్త ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అలాగే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై కూడా వైరస్ ప్రభావం ఎక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక జీహెచ్ ఎంసీలో ఫరిదిలో గత నెల రోజులుగా కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. రాష్ర్ట వ్యాప్తంగా డెత్ రేట్ కూడా పెరిగింది. దీంతో తెలంగాణ సర్కార్ మరోసారి సిటీలో లాక్ డౌన్ విధించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నాలుగైదు రోజుల్లో లాక్ డౌన్ పై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. దీంతో రాజధానిలో మరోసారి లాక్ తప్పదని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నా యి.