స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ !

తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. భారత జాతీయ జెండాను ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు సీఎం కేసీఆర్. భారత స్వాతంత్ర్య ఘట్టాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారన్ని.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

cm kcr meeting
cm kcr 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది. సంజీవయ్య పార్క్‌తో పాటు తెలంగాణలోని 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాస రచన పోటీలు, డిబేట్స్, డ్రాయింగ్, కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ఒక పండుగలా నిర్వహించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం కేసీఆర్.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్రం సంబరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈ వేడుకల గురించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మార్చి 12 2021 నుంచి ఆగస్టు 15 2022 వరకు వేడుకలు జరుగుతాయి.