KTR: కేటీఆర్ తో భేటీ అయిన తీన్మార్ మల్లన్న… ఈ భేటీ వెనుక కారణం అదేనా?

KTR: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిశారు. ఇటీవల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈయనపై అనర్హత వేటు వేస్తూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీ నుంచి మల్లన్న సస్పెండ్ కావడంతో ఈయన యూత్ తీసుకొని తిరిగి బిఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతున్నారని తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో బిఆర్ఎస్ నాయకులను పొగుడుతూ ఈయన ఎన్నో వీడియోలను చేశారు.

ఇలా బిఆర్ఎస్ పార్టీ చెంతకు చేరాలన్న ఉద్దేశంతో ఈయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తెలుస్తుంది. అయితే తాజాగా ఈయన కే టి ఆర్ తో బేటి అయ్యారు ఈ క్రమంలోనే ఇద్దరు బేటి వెనుక గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు సొంతంగా ఎన్నికల్లో పోటీచేసిన తీన్మార్‌ మల్లన్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ఇక ఈయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఒక యూట్యూబర్ గా ఎంతో ఫేమస్ అయ్యారు. నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేసేవారు అయితే ఈ వీడియోలలో ఎక్కువ భాగం కేటీఆర్ కెసిఆర్ అలాగే హరీష్ రావును తిడుతూనే వీడియోలు చేసేవారు. టిఆర్ఎస్ నాయకులను పూర్తిస్థాయిలో వ్యతిరేకించిన మల్లన్న ప్రస్తుతం కేటీఆర్ తో భేటీ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే వీరిద్దరూ ఇలా భేటీ కావడానికి కారణంకాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బీసీ బిల్లుపై చర్చించేందుకే అని సమాచారం. బీసీ కుల గణనను తప్పు పడుతున్న మల్లన్న.. బీఆర్‌ఎస్‌ బీసీ బిల్లుపై అసెంబ్లీలో నిలదీయాని కేటీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఇలా భేటీ అవడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.