Tamil Nadu: తమిళనాడులో మతమార్పిడి కల్లోలం.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు…!

Tamil Nadu: ఈ మధ్య కాలంలో చాలా మంది మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని ఒక పాఠశాలలో మతమార్పిడి కల్లోలం రేపింది. ధనిక, పేద , కులమతాల భేదభావం లేకుండా అందరూ సమానంగా ఉండే పాఠశాలలో ఇటువంటి మత మార్పిడి విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కన్యాకుమారిలోని ఒక పాఠశాలలో మత మార్పిడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

కన్నతువిలై ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిచేసిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు ఈ విషయం గురించి దర్యాప్తు చేసి ఈ ఘటనకు పాల్పడిన ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు పాఠశాలలోనే విద్యార్థులను విచారణ చేయగా.. సదరు ఉపాధ్యాయురాలు ఎప్పుడు తమకు బైబిల్ చదవమని చెప్పేవారని, భోజనం విరామ సమయంలో తనతో పాటు ప్రార్థన చేయాలని చెప్పేవారు. అని విద్యార్థి చెప్పాడు.

మేము హిందువులం బైబిల్ బదులు భగవత్ గీత చడువుతమని చెప్పినందుకు సదరు ఉపాధ్యాయురాలు హిందువుల మీద అభ్యంతర వాక్యాలు చేసి, విద్యార్థులను పిలిపించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బలవంతంగా ప్రార్థనలు చేయించేదని విద్యార్థులు వెల్లడించారు. ఏఐఏడీఎంకే నేత కోవై సత్యన్ స్పందిస్తూ ఈ ఘటన గురించి స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి ఇలాంటి ఆరోపణలు చాలా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.