చేతులెత్తేసిన చంద్రబాబు.. హీనస్థితికి టీడీపీ

chandrababu telugu rajyam

  ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతుంది. పైగా అధికారంలో యువనేత జగన్ ఉండటంతో నూతిలో పడ్డ ఎలుక మాదిరి తయారైంది టీడీపీ పరిస్థితి. ఎంతలా అంటే వచ్చే ఏడాది జరగబోయే కృష్ణ ,గుంటూరుకి చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడానికి సరైన అభ్యర్థి కూడా లేకపోవటంతో, ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. 2015 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎస్. రామకృష్ణ పోటీచేసి విజయం సాధించాడు.

mlc ramakrishna telugu rajyam

 

  అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి విజయం సాధించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అయితే ఎట్టి పరిస్థితిలోను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీచేయాలని రామకృష్ణ భావిస్తున్నాడు, ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆయన మరోసారి టీడీపీ నుండి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు అదే విషయం టీడీపీ వర్గాల్లో అలజడి సృష్టిస్తుంది. అమరావతి కేంద్రంగా టీడీపీ చేస్తున్న రాజకీయం అందరికి తెలిసిందే, ఎట్టి పరిస్థితులో రాజధానిగా అమరావతి ఉండాలని టీడీపీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఇందుకోసం ఉత్తరాంధ్రలో కూడా పార్టీని బలిచేయటానికి చంద్రబాబు సిద్ధం అయ్యాడు.

chandrababu telugu rajyam

 

  కృష్ణ, గుంటూరు కోసం అంతగా కష్టపడుతున్న బాబుకు అక్కడి ఎన్నికల్లో పోటీచేసి గెలవటం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఆ నమ్మకం మాత్రం స్థానిక టీడీపీ నేతల్లో లేకపోవటం విడ్డురం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్య ప్రజానీకంతో సంబంధం లేకపోయినా, టీచర్స్ దాదాపుగా అక్కడి స్థానికులే. కాబట్టి టీడీపీకి మద్దతు భారీ స్థాయిలోనే రావాలి. అయితే అనుకున్న స్థాయిలో మద్దతు రాకపోవటంతోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినా రామకృష్ణ టీడీపీ నుండి కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. రామకృష్ణ ఇండిపెండెంట్ గా పోటీచేస్తే టీడీపీ మరో అభ్యర్థిని బరిలో దించే అవకాశం కూడా లేదు. బయట నుండి రామకృష్ణ కు మద్దతు ఇవ్వాల్సిందే..

  టీడీపీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ రామకృష్ణ గెలిస్తే మేము మద్దతు ఇచ్చామని, అమరావతి ఉద్యమానికి ఉద్యోగులు కూడా మద్దతు ఇచ్చారని చెప్పుకోవచ్చు, ఒకవేళ రామకృష్ణ ఓడిపోతే ఆయన తమ పార్టీ కాదంటూ, తమకు సంబంధం లేదంటూ పక్కకు తప్పుకోవచ్చనే ఆలోచన కూడా టీడీపీ చేసినట్లు తెలుస్తుంది. ఇదేదో గొప్ప వ్యూహం అన్నట్లు టీడీపీ భావిస్తే అంతకంటే చేతకాని తనం మరొకటి లేదు. ఒకప్పుడు పార్లమెంట్ లోనే ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన పార్టీ, నేడు కనీసం రెండు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధైర్యంగా పోటీచేయలేని స్థితికి చేరుకుందంటే దీనికంటే అవమానకరం మరొకటి లేదు. ఏ దిక్కు లేనోడికి ఆ దేవుడే దిక్కు అన్నట్లు, ఇక టీడీపీని ఆ దేవుడే కాపాడాలి…గోవిందా..గోవిందా…