గోరంట్ల వీడియో వెనుక ఉన్నది టీడీపీ నేతలే.. చంద్రబాబు నోరు విప్పుతారా?

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో గోరంట్ల మాధవ్ వీడియో హట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గోరంట్ల మాధవ్ పరువు పోయే విధంగా ఆయన వీడియో గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అనంతపురం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియో కాదని తేల్చి చెప్పారు. ఐటీడీపీ అనే వాట్సాప్ గ్రూప్ లో యూకేకు చెందిన ఒక నంబర్ నుంచి వీడియో అప్ లోడ్ అయిందని పోలీసులు వెల్లడించారు.

గోరంట్ల వీడియో వెనుక ఉన్నది టీడీపీకి చెందిన వాళ్లే అని ఈ విధంగా క్లారిటీ వచ్చింది. గోరంట్ల మాధవ్ ను ఎంపీ పదవి నుంచి డిస్మిస్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ పరువు పోవాలనే ఆలోచనతోనే టీడీపీ నేతలు ఇలాంటి వీడియోలను లీక్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒరిజినల్ వీడియో దొరికి ఆ వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో అని తేలితే మాత్రం టీడీపీ పరువే పోతుంది.

అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా టీడీపీ ప్రజా సంక్షేమంపై దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు తప్పు మీద తప్పు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫేక్ వీడియోలను సృష్టించడం, మార్ఫింగ్, ఎడిటింగ్ చేయడం వల్ల టీడీపీకి నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. కొన్ని విషయాలలో టీడీపీ కంటే జనసేన బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీ నేతలు ఇలాంటి కేసుల ద్వారా వార్తల్లో నిలిస్తే సైలెంట్ అయ్యే చంద్రబాబు వైసీపీ నేతల వీడియోలు వాస్తవమో కాదో తెలియకముందే ఘాటుగా స్పందించడం గమనార్హం. చంద్రబాబు మారాల్సిన సమయం ఆసన్నమైందని ఇదే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తే 2024 ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఇతర పార్టీల నేతల పరువు తీసే వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.