వైకాపా రెంబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారం కంచికి చేరిన సంగతి తెలిసిందే. పార్టీని కాదని బయటకు వచ్చేసిన రాఘురాం పై మాకు అవసరం లేదని వైకాపా అదిష్టానం తేల్చేసింది. ఇంక రఘురాంని ఎంపీ పదవి నుంచి తప్పించాలని వైకాపా ఎంపీలంతా కంకణం కట్టుకుని ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ని కలిసి ఓ లేఖ అందించి అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో రఘురాంలో టెన్షన్ మొదలైంది. అనర్హత వేటును ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీపై వేటు పడుతుందా? పడదా? కోర్టు ఏం చెబతుంది? లోక్ సభలో తలేత్తే వ్యవహారం ఏంటన్నది? పక్కనబెడితే రఘురాం ఇప్పుడు టీడీపీ భజన మొదలు పెట్టారు.
అమరావతి రైతుల రాజధాని ఆందోళనకు నేటితో 200 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని రైతులకు పిలుపునిచ్చి చంద్రబాబు నిరసన తెలిపారు. తాజాగా ఈ అంశంపై రఘురాం ఏమన్నారంటే? అమరావతికి పర్యావరణ సానుకూలతలు ఎన్నో ఉన్నాయని, పాలనా రాజధానిగా అమరావతి ఉండటమే భావ్యమన్నారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని.. ప్రభుత్వ నిర్ణయమన్నారు. సీఎం జగన్ కూడా అప్పుడు అమరావతికి మద్దతు తెలిపారన్నారు.
పార్టీ పరంగా ఏనాడు అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. ఇప్పటికే అక్కడ చాలా వరకూ పనులు పూర్తయ్యాయన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం అనవసరంగా డబ్బు వృద్ధా చేస్తుందని అమరావతి పాట పాడారు. రఘురా ఈ వ్యాఖలేవి వైకాపాలో ఉన్నంత కాలం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాజధానిపై పోరాటం చేస్తోంది కేవలం టీడీపీ మాత్రమే. అయితే కరోనా సమయంలో పోరాటం చేసింది అక్కడ అసలైన రైతులే. అప్పుడు టీడీపీ నేతలు ఎలాంటి నిరసనల్లో పాల్గొనలేదు. తాజాగా ఆ పోరాటానికి 200 రోజులు పూర్తవ్వడంతో చంద్రబాబు నేడు మళ్లీ హడావుడి చేసారు. మొదట్లో జనసేన, సీపీఐ, సీపీఎంలు గళం వినిపించినా తర్వాత ఆ పార్టీలు సైలెంట్ అయ్యాయి.