టీడీపీ అంటేనే తెలుగు జాతి అన్నట్టుగా మాట్లాడుతున్న టీడీపీ నాయకుల వ్యూహం ఏమిటి?

cbn

2019లో వచ్చిన ఓటమి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా ఇంకా నమ్మలేకపొతున్నారు. 2014నుండి 2019 వరకు ఆయన పాలన నచ్చకపోవడం వల్లే జనం ఇలాంటి తీర్పు ఇచ్చారని చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నాయకులు కానీ ఇంకా అంగీకరించడానికి వాళ్లకు మనసు ఒప్పడం లేదు. అందుకే వైసీపీనే ప్రజలను మోసం చేసి, తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఈమధ్య కాలంలో టీడీపీ నాయకులు 2019లో తమ ఓటమిని సరికొత్త వాదనను వినిపిస్తున్నారు.

cbn telugurajyam
cbn telugurajyam

ఆ వాదన ఏంటంటే ఎన్నికల్లో ఓడింది టీడీపీ కాదంట, ప్రజలే ఓడారని, వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేసి గెలిచిందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీపై వైసీపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేసినా కూడా దాన్ని టీడీపీ నాయకులు తెలుగు ప్రజల వైపు తిప్పుతూ, తమ వెనక తెలుగు ప్రజలు ఉన్నారన్నట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. తెలుగుదేశం మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే ఇది తెలుగు జాతి మీద దాడి అని అనగలిగే ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటే. ఇపుడు తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచారాన్ని ఎంచుకుంది. దాన్ని జనంలోకి పోనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆశపడుతోంది.

గత ఎన్నికల్లో టీడీపీ కాదని, ప్రజలే ఓడారని మాజీ మంత్రి జవహర్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు. ప్రజలను మీరు వంచించారు. అమాయకులను చేసి ఓట్లేయించుకున్నారు అంటూ వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎపుడూ టీడీపీని ఓడించలేదని కూడా బాబు అంటున్నారు. వైసీపీయే మాయ చేసిందని కూడా అంటున్నారు.

ఇలా టీడీపీ అంటేనే తెలుగుజాతి అన్నట్టు టీడీపీ నాయకులు కలరింగ్ ఇస్తున్నారు. ఇలా కలరింగ్ ఇస్తూ వైసీపీ తెలుగు ప్రజలకు దూరం చేయడానికి టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పతకంపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.