Vijay Sai Reddy: మాజీ దివంగత స్పీకర్ కోడెల చావుకు విజయ్ సాయి రెడ్డి కారణమా… అరెస్ట్ తప్పదా?

Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతా తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ, జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా ఉన్నటువంటి నేత విజయసాయిరెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని ఈయన రాజీనామా చేశారు.

ఇలా విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం అవుతూ ఉన్నప్పటికీ కూడా గతంలో ఆయన చేసిన తప్పిదాలు మాత్రం ఇప్పటికి తనని వెంటాడుతూనే ఉన్నాయని చెప్పాలి.ఇప్పటికే కాకినాడ పోర్టు వాటాల బదిలీ సహా పలు కేసుల్లో ఆయన పాత్రపై ఆరోపణలు, కేసులు ఉన్నాయి.. తాజాగా ఈయనపై మరికొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి.ఇప్పుడు పల్నాడులో సాయిరెడ్డితో పాటు నరసరాపుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపైనా ఇవాళ ఓ కేసు దాఖలైంది. దీంతో సాయిరెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు.

పల్నాడు ప్రాంతానికి చెందిన మాజీ దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ గత ఎన్నికలలో వైసిపి గెలిచిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.దీని వెనుక విజయసాయిరెడ్డితో పాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు నరసరావుపేట పోలీసు స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డి కోడెల శివప్రసాద్ అలాగే ఆయన కుమారుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారు తద్వారా మానసిక వేదనకు గురి అయిన కోడల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారని ఫిర్యాదులు చేశారు.తాజాగా నాగరాజు తాను కోడెల తండ్రీ కొడుకులపై తప్పుడు ఫిర్యాదు చేశానంటూ గతంలో పెట్టిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. ఇలా ఈయన కేసు వెనక్కి తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కోడెల శివప్రసాద్ మరణానికి పరోక్షంగా విజయసాయిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కారణమంటూ పల్నాడులో కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో భాగంగా సాయి రెడ్డి ఏ క్షణమైన అరెస్టు కావచ్చు అని తెలుస్తోంది