వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండదని, మధ్యలోనే ప్రభుత్వం కూలిపోతుందని, జమిలి ఎన్నికలు వస్తాయని టీడీపీ అధినేత మొదట నుండి కలలు కంటున్నారు. అయితే ఆయన కలలు కన్నట్టు కాకుండా తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్నికల కోసం ఎదురు సిచూసిన చంద్రబాబు బాబు ఇప్పుడు మాత్రం తిరుపతిలో పోటీ చెయ్యడానికి భయపడుతున్నారని తెలుస్తుంది.
వైసీపీకి భయపడ్డ చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యడం ప్రారంభించింది. ప్రజల్లో కూడా వైసీపీపై సానుకలమైన అభిప్రాయం ఉంది. భాష విషయంలో, తిరుపతి డిక్లరేషన్ విషయంలో వైసీపీపై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది కానీ ప్రజల నుండి ఊహించిన స్థాయిలో టీడీపీకి మద్దతు లభించలేదు. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికే పాలన విషయంలో చాలా ర్యాంక్స్ వస్తున్నాయి. ప్రజల్లో వైసీపీకి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం.
టీడీపీ ప్రతిష్ట దెబ్బతినదా!
ఎన్నికల్లో పోటీ చెయ్యకపోతే పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందని టీడీపీ సీనియర్ నేతలు చెప్తున్నప్పటికి కూడా చంద్రబాబు మాత్రం పోటీకి ఒప్పుకోవడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరీ వైసీపీ చంద్రబాబు ఇంతలా భయపడుతున్నాడంటే జగన్ పాలన ఎంత బాగుందో ఇక్కడే అర్ధమవుతుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తుంది. మొన్న డిక్లరేషన్ విషయంలో చేసిన రచ్చ ఇప్పుడు ఉపయోపడే అవకాశం ఉందని భావిస్తున్న బీజేపీ పోటీకి సిద్ధమవుతోంది.