డొనాల్డ్ ట్రంప్ తెలుసా మీకు. నిన్నటి వరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా.. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ గా జో బైడెన్ గెలిచారు.. ట్రంప్ ఘోరంగా ఓడిపోయారు కదా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. అయితే… డొనాల్డ్ ట్రంప్ కు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మధ్య చాలా పోలికలు ఉన్నాయట. డొనాల్డ్ ట్రంప్ అనగానే.. మనకు ఏపీలో సీఎం జగనే గుర్తొస్తారంటూ టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే ట్రంప్.. అమెరికాలో లాక్ డౌన్ విధించలేదు… సేమ్ టు సేమ్ జగన్ కూడా ఇక్కడ ఏదేదో మాట్లాడారు. చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా తగ్గుతుందన్నారు. వీళ్లిద్దరూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. అందుకే ట్రంప్ ను అమెరికా ప్రజలు ఘోరంగా ఓడించారు. మరోసారి కూడా నేనే అధ్యక్షుడిని. నన్నెవరూ ఓడించలేరు.. అని ట్రంప్ అన్నాడు. ఓడిపోయాడు. ఏపీలో నేను మరో 30 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిని.. అంటూ జగన్ అంటున్నారు. కానీ… ట్రంప్ కు ఎటువంటి ఓటమి ఎదురైందో… జగన్ కు కూడా అదే ఓటమి ఎదురవబోతోంది.. అంటూ పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శించారు.
సేమ్.. ట్రంప్ పాలనలో కూడా జాత్యాహంకార దాడులు జరిగాయి. ఇక్కడ కూడా అలాగే దళితులపై దాడులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో మోసం జరిగింది… నేనొప్పుకోను అంటూ ట్రంప్ ఎగిరెగిరిపడుతున్నాడు. ఇక్కడ ఎన్నికల కమిషన్ తో జగన్ గొడవ పెట్టుకుంటున్నారు. ఇలా.. చూస్తే ప్రతి విషయంలో జగన్, ట్రంప్ కు పోలికలు ఉన్నాయి. అప్పుడు 2016లో ఎన్నో అబద్ధాలు చెప్పి… హిల్లరీ క్లింటన్ ను ఓడించి అధికారం చేజిక్కించుకున్నాడు ట్రంప్. సేమ్.. 2019 ఎన్నికల్లో కూడా జగన్.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసి గెలిచాడు.. అంటూ ఆయన ధ్వజమెత్తారు.