AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది అయితే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ పథకాలను ప్రకటించి ప్రజలను తమ వైపుకు తిప్పుకొని అధికారంలోకి కూటమి నేతలు వచ్చారు అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఒక పథకాన్ని కూడా సరైన విధంగా అమలు చేయలేకపోయింది. ఇలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని నాకు ఉంది కానీ ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అంటూ ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఒకే అబద్దాన్ని రిపీటెడ్ గా చెబుతూ వస్తున్నారు.
ఇలా ఏడాది అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా రాకపోవడంతో ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది అయితే ఈ విషయాన్ని స్వయంగా తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఒప్పుకున్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి గెలవటం కష్టం అంటూ ఈయన ఓపెన్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
మున్సిపల్ కార్యాలయం ఎదుట మీడియా సమావేశంలో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నామని, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఈయన తెలిపారు. జగన్ గతంలో నేరుగా ప్రజల జేబుల్లోకి వివిధ పథకాల ద్వారా డబ్బులను అందజేశారు. కానీ మేము డబ్బులు ఇవ్వలేదని మా ముందే కూటమి ప్రభుత్వాన్ని తిడుతున్నారు.
తాడిపత్రిలో మేము రోడ్లు బాగా వేయించాము, నీటికీ కూడా కొదువ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా బాగా చేయించాం ఇలా ఎన్నో అభివృద్ధి చేసిన ప్రజల జోబులలోకి డబ్బులు లేకపోవడంతోనే వ్యతిరేకత వస్తుందని, పాలకపక్షంలో ఉన్నవారు ఎప్పుడు ఓడిపోతారని ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికలలో తాము గెలవడం కష్టమే అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.