టీడీపీ రొడ్డగొట్టుడు విమర్శలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హాట్ కామెంట్స్.. ??

 

ఏపీలో రోజురోజుకు తన బలాన్ని కోల్పోతున్న టీడీపీ ఎలాగైనా ప్రజల నాలుకల్లో నానాలని నరం లేని ఆ నాలుకతో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారట.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరి నుండి ఇంకా ఆ పార్టీ మీదే ఆశలు పెట్టుకుని చంద్రబాబు తమను ఎక్కడికో తీసుకెళ్లుతాడనే భ్రమలో బ్రతుకుతున్న పచ్చ నాయకులు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ తామేదో ఏపీని తమ ప్రభుత్వ హయమంలో ఉద్దరించినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధాకారమైనట్లుగా ఊహించుకుంటూ వైసీపీ మీద విమర్శలు చేస్తే గొప్పవారం అనే భ్రమలో ఉంటున్నారట..ఇక తుప్పు పట్టిన సైకిల్ తుప్పు వదల కొట్టుకోకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్న యువనేత ఏపీ సీయం వైఎస్ జగన్ పై నోటికొచ్చినట్లుగా మాట్లాడటం వైసీపీ నేతలకు నచ్చడం లేదట.. ఇదిలా ఉండగా అధికార పార్టీ పై మరో టీడీపీ నేత అయిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు.. విశాఖ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అవగాహన లేదని, విశాఖను పాలనరాజధానిగా చేసింది వైసీపీ లబ్ది కోసమేనన్నట్లుగా ఆయన మాట్లాడుతుండటం వినే వారికి వింతగా అనిపిస్తుందట..

మరీ వైఎస్ జగన్‌కు విశాఖ మీద అవగాహన లేదనుకుంటే గతంలో అయిదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది కదా.. అప్పుడు విశాఖకు వీరు తెచ్చిపెట్టిన కీర్తి ఏంటో, పాలరాయితో రోడ్లు, బంగారు భవనాలు ఏర్పాటు చేశారా? అసలు టీడీపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధి కోసం చేసిందేంటని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారట. అంతెందుకు కనీసం విశాఖలో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా చంద్రబాబు సుముఖంగా లేరన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా విశాఖను అన్ని రకాలుగా గత సర్కార్ వాడుకుంది కానీ రాజధాని హోదా మాత్రం ఇవ్వలేదని మండి పడుతున్నారు.

ఇక ఎవరెన్ని గుర్తు చేసినా కూడా టీడీపీ తన రొడ్డగొట్టుడు విమర్శలు ఆపదు.. విశాఖ నుంచి భోగాపురం వరకూ అయిదు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రానికి ప్రతిపాదించిన సంగతికి కూడా పచ్చ తమ్ముళ్ళకు తెలియదు.. మరెందుకు జరుగుతున్న అభివృద్ధిని చూస్తూ ఆనంద పడక ఇలా కడుపు మండించుకోవడం అంటూ అధికార పార్టీ నాయకులు గుర్రుమంటున్నారట..